తమను ఆదుకోవాలని తాండవాసుల వేడుకోలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ఇందల్ వాయి మండలంలోని గుట్ట కిందితండాలో ఎవరు ఊహించని విధంగా వరద రావడంతో తీవ్రంగా నష్టపోయామని, తమకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని బాధ్యత కుటుంబాలు అధికారులను వేడుకున్నారు. శుక్రవారం కొందరు అధికారులు వరదతో తీవ్రంగా నష్టపోయిన గుట్ట కింది తండా లోని ఖత్రోత్ అడకట్టు, బడవత్ అడకట్టులో పర్యటించారు. ఊహించని విధంగా తండా వాసులకు నష్టం జరిగిందని, జరిగిన నష్టానికి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందే విధంగా చూడాలని వారు అధికారులను వేడుకున్నారు.
వరద వల్ల చోటు చేసుకున్న కుంటాలకు వెంటనే మరమత్తులు చేసే విధంగా మంజూరు చేయాలని అధికారులకు వివరించారు. తమ జరిగిన నష్టాన్ని అంచన వేసి అధికారులకు నివేదిక అందజేస్తామని అధికారులు తాండవాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబడ హక్కుల పోరాట సమితి యువజన అధ్యక్షులు మహిపాల్ నాయక్ మాట్లాడుతూ.. జరిగిన నష్టం కుంట విషయమై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి మంజూరు చేసే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దమనుషులు దేగవత్ శివరాం నాయక్, వి డి సి చైర్మన్ పీరు, దాసు,లౌడ్య గోవింద్, శ్రీనివాస్ తో పాటు తదితరులు ఉన్నారు.
తండాను సందర్శించిన అదికారులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES