బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నవతెలంగాణ – మణుగూరు
సెప్టెంబర్ 10 11 తేదీలలో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శుక్రవారం విలేకరులకు తెలిపారు. కేటీఆర్ సభలను విజయవంతం చేయుటకు మండలాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. 30న కొత్తగూడెం టౌన్,అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 31న ఇల్లందు నియోజకవర్గ, పాల్వంచ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
సెప్టెంబర్1, న చర్ల,దుమ్ముగూడెం మండల లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 2, చుంచుపల్లి,సింగరేణి హెడ్ ఆఫీస్ కొత్తగూడెం వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 5, న భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం.భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 5న లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 7న సుజాతనగర్ జూలూరుపాడు మండలలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కావున అన్ని మండలాల అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు పిఎసిఎస్ అధ్యక్షులు,మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, విద్యార్ది & యువజన నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, సోషల్ ఉద్యమకారులు కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.