ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ కు వినతి
నవతెలంగాణ – మణుగూరు
సింగరేణి సంస్థ 2024 25 సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలు వెల్లడించడంతోపాటు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు నాగేల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ కు వినతి పత్రం ను అందచేశారు. కార్మికుల హక్కులను కాపాడటం, సాధించడంలో గుర్తింపు సంఘం ఏఐటియూసి, ప్రాతినిధ్య సంఘం ఐ ఎన్ టి యు సి ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యాజమాన్యానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తున్నాయని తెలిపారు.
వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, ముకేశ్, నరేష్, వినయ్ కుమార్, దాసరి కృష్ణ, దాసుమళ్ళ ప్రవీణ్, కోన వెంకటేష్, గఫూర్, శ్రావణ్ యాదవ్ పూర్ణచంద్రరావు, కొల్లు సాయి అరుణ్, పి కె నాగరాజు, ప్రవీణ్, శ్రీనివాస్, పడ్డం శ్రీనివాస్ గూగులోత్ రమేష్ నాయక్, మహేందర్, అశోక్, రాజేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.