నవతెలంగాణ – వలిగొండ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ ఉన్నత పాఠశాల యందు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల కవితలు,నినాదాలు, సూక్తులు, పాటలతో పాటు డ్యాన్సుల ద్వారా అందరిని అలరింపజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సవిత గారు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడని, గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని అందించిన గొప్ప పితామహుడని అన్నారు. వర్ణమాలలోని ఆ,ఆ రూపంలో విద్యార్థిని విద్యార్థులు కూర్చొని తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు.ఈ కార్యక్రమంలో సిస్టర్ అల్బీన, సిస్టర్ జెనిఫర్, సిస్టర్ సంగీత, తెలుగు భాష ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాండు,ఉమాదేవి, రాధా, నాగలక్ష్మి, తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES