తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ‘నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించారు.
ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కథ విన్నప్పుడు ఇది నా శైలి రచనతో ఉన్న కథ అనిపించింది. మనమంతా బాగా రిలేట్ అయ్యే కథ ఇది. ఇందులో సీరియస్ లవ్ స్టోరీ ఏం లేదు. టీనేజ్‌లో ఉండే ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం. అది సరదాగా సాగుతుంది. సాంగ్స్ కూడా మనం ఈజీగా రిలేట్ అయ్యేలా డిజైన్ చేశాం. మనం మాట్లాడుకునే మాటలు, సందర్భానుసారం ఉపయోగించే పదాలే ఉంటాయి’ అని తెలిపారు.
‘వెబ్ సిరీస్‌లు ఇలాగే ఉండాలనే ట్రెండ్‌ను ‘నైన్టీస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది కూడా అలాగే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ఈటీవీ విన్ నుంచి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాం. ఈ మూవీలో హీరో, హీరోయిన్స్‌కు చదువురాదు. చదువు రాని అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఫన్నీ స్టోరీ ఇది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 200 థియేటర్స్‌లో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న మూడు సెంటర్స్‌లో ఫ్రీ షోస్ ఇంటర్ విద్యార్థుల కోసం వేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తాం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈటీవీ విన్ నుంచి ఆరు భిన్నమైన సినిమాలు రాబోతున్నాయి’ అని మరో నిర్మాత సాయికృష్ణ చెప్పారు.
అందరూ కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -