Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో మళ్లీ మేఘవిస్పోటం

ఉత్తరాఖండ్‌లో మళ్లీ మేఘవిస్పోటం

- Advertisement -

శిథిలాల కింద అనేక మంది!
రుద్రప్రయాగ్‌:
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌, చమోలీ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను ముంచెత్తుతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి కూడా స్పందించారు.

చమోలీ జిల్లాలోని మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోయారు. అలాగే పశువుల కొట్టం కూలడం వల్ల దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి. ఓ జంట శిథిలాల కిందే చిక్కుకుపోయారని జిల్లా కలెక్టర్‌ సందీప్‌ తివారీ తెలిపారు. మరో జంటను శిథిలా నుంచి సురక్షితంగా కాపాడమని, కానీ వారికి తీవ్రంగా గాయలయ్యాయని చెప్పారు.

మేఘ విస్ఫోటం కారణంగా రుద్రప్రయాగ్‌లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్‌లోని హనుమాన్‌ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. జౌలా-భదేత్‌ గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. వరదల్లో అనేకమంది గల్లంతైనట్టు సమాచారం. అదే ప్రాంతంలోని స్యూర్‌ గ్రామంలో ఒక ఇల్లు దెబ్బతింది. రోడ్డుపై పార్క్‌ చేసిన కారు శిథిలాల్లో కొట్టుకుపోయింది. భదేత్‌, బగద్ధార్‌, తలాజ్‌మణి గ్రామాల రెండు వైపులా వాగులు ఉప్పొంగి వరద ముప్పు మరింత పెరిగింది. కేదార్‌నాథ్‌ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్‌, బాగేశ్వర్‌, చమోలి, హరిద్వార్‌ జిల్లాల్లోని పాఠశాలలను మూసివేశారు.

రుద్రప్రయాగ్‌లోని బాసుకేదర్‌ తహసీల్‌, చమోలి జిల్లాలోని దేవల్‌ ప్రాంతంలో మేఘ విస్ఫోటం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయని తెలిపారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని సీఎం పుష్కర్‌ ధామమి చెప్పారు.
వరద ప్రవాహ ధాటికి ప్రజలు, అడవుల్లోని మూగజీవాలు సైతం భారీస్థాయిలో మతిచెందుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారి గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినా చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో తప్పించుకొనే మార్గం లేకపోయిందని చెప్పారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రాంనగర్‌ పెద్ద కాలువలో వరద నీటి ధాటికి చిరుత పులి కొట్టుకుపోతున్న దశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రామాలలోని జంతువులు, పశువులు సైతం భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad