నవతెలంగాణ-హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యంగా… కాలేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నివేదిక కోసమే ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నారు.
అయితే కాలేశ్వరంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో…. రంగంలోకి కేసీఆర్ దిగుతారా? లేక హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాలి. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఈ బాధ్యతలు మొత్తం హరీష్ రావు చూసుకోబోతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు మాత్రమే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ.. అయినట్లు సమాచారం అందుతోంది.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES