Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పసుపులో దుంప కుళ్ళు... నివారణ చర్యలు

పసుపులో దుంప కుళ్ళు… నివారణ చర్యలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా పసుపు పంటలో దుంప కుళ్ళు, వేరు కుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉప్లూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తెలిపారు. రైతులు సకాలంలో సరైన జాగ్రత్తలతో చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.దుంప కుళ్ళు, వేరు కుళ్ళు నివారణకు ఒక ఎకరాకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు/లీటర్ నీటికి బ్యాటరీ పంపు తో మొక్క మొదళ్ళు తడిచేలా పిచికారి చేసుకోవాలని సూచించారు.ఈ మందును డ్రిప్ లో కూడా ఇచ్చుకోవచ్చని తెలిపారు.మెటలాక్సిమ్ మరియు 10కిలోల 3జి గుళికలను, వీలైతే వేప పిండి కూడా పసుపు పంటలో వేసుకుంటే వేరు కుళ్ళు, దుంప కుళ్ళు తెగులును ముందస్తుగా నివారించుకోవచ్చని సూచించారు. కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోయా పంట, మొక్కజొన్న, వరిలో కొట్టుకుపోయిన లేదా ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad