కేఆర్‌ఎంబీని కోరిన తెలంగాణ
త్రిసభ్య కమిటీ భేటీకి ఏపీ గైర్హాజరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వేసవి తాగునీటి అవసరాలతోపాటు వచ్చే జులై వరకు తెలంగాణ దాహార్తిని తీర్చేందుకు దాదాపు 10.26 టీఎంసీలు అవసరమని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ఎదుట వాదనలు వినిపించారు. ప్రస్తుత వేసవి, ఎండలు, ఏపీ నీటి తరలింపు, ఇతర అంశాలపై కూలంకషంగా త్రిసభ్య చైర్మెన్‌తో చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ అధికారులు కేఆర్‌ఎంబీ బోర్డు సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని కోరుతూ లేఖ రాస్తూ తాము రాలేకపోతున్నట్టు తెలియజేశారు. ఈసందర్భంగా కేఆర్‌ఎంబీ ఎదుట తెలంగాణ ఈఎన్సీ జి అనిల్‌కుమార్ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమెన సమావేశానికి ఏపీ రాకపోవడంపై తప్పుబట్టారు. ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్యలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు రాకపోవడం సమంజసం కాదన్నారు. జులై 31 వరకు కల్వకుర్తికి 300 క్యూసెక్కులు, హైదరాబాద్‌కు 750 క్యూసెక్కులు, ఖమ్మంకు 300 క్యూసెక్కులు తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలని ఈఎన్సీ కోరారు. మొత్తంగా జులై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కావాలని కోరారు. 4.28 క్యూసెక్కులు ఆవిరి నష్టాలు పోతే ఉన్న 15 టీఎంసీల్లో 0.55 టీఎంసీలు మిగులుతాయని కేఆర్‌ఎబీ చైర్మెన్‌కు ఈఎన్సీ వివరించారు. నాగార్జునసాగర్‌లో 510 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపింగ్ చేయడం సరికాదనీ, ఏపీ వినియోగం తగ్గించుకోవాలని గతంలో ఏపీకి చెప్పామని చైర్మెన్‌కు దృష్టికి తెచ్చారు. కాగా తెలంగాణ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బోర్డు కోరింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలు వచ్చే వరకు నాగార్జునసాగర్ కుడికాల్వ రెగ్యులేటర్, ముచ్చుమర్రి నుంచి నీరు వాడరాదని తెలంగాణ కోరింది.
తాగునీటికి 10.26 టీఎంసీలు కావాల్సిందే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES