Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి: సీపీఐఎంఎల్

వరద బాధితులకు తక్షణ సాయం అందించాలి: సీపీఐఎంఎల్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, బతుకమ్మ కుంట వరద బాధితులకు తక్షణ సహాయం రెండు లక్షలు, వరదతో సర్వం కోల్పోయిన బాధితులకు రూ.10 లక్షలు ప్రభుత్వం అందించాలనీ సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి .ప్రభాకర్,  కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు రావడం వలన పట్టణం లోని జి ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, బతుకమ్మ కుంట కాలనీల్లో ఇళ్లలోకి నీరు రావడం వలన భారీ నష్టం జరిగిందనీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాలనీల్లో వాసులని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, రామకృష్ణ లు బాధితులతో కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ స్థాయి వరద రావడం వలన ఇంట్లో ఉన్న బాధితులంతా డాబా పైకి వెళ్ళిన మొదటి అంతస్తు పూర్తిగా మునిగిపోవడంతో  కట్టుబట్టలతో వారు బయట పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, 24 గంటలు ఇళ్లపైనే సహాయ కోసం ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడపడం జరిగిందన్నారు.  భారీగా వచ్చిన వరదకు కార్లు, బైకులు ఇళ్లలోని నిత్యవసరమైనటువంటి వస్తువులు కూడా కొట్టుకుపోవడం జరిగిందని దీంతో బాధితులు దుఃఖంలో మునిగిపోయారని  అన్నారు. కనీసం తినడానికి కూడా ఏమీ లేకుండా వర్షం నీరు ఇళ్లల్లో చేరడంతో బాధితుల కన్నీళ్లు మిన్నంటాయి అన్నారు.

కామారెడ్డిలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం ముందస్తు వరదను అంచనా వేయకపోవడం, అదేవిధంగా నాళాల పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మ్యామ్యలకు అలవాటు పడిన అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం వలన నీరు ఇళ్లలోకి చేరిందన్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు చేసిన పాపం వలన సాధారణ ప్రజలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కనీసం రెండు రోజుల నుంచి తక్షణ సహాయం ప్రభుత్వం అందించక పోవడం దారుణం అన్నారు. రెండు రోజుల నుండి రాజకీయ నాయకులు, అధికారుల అడవిడి తప్ప తక్షణo చేయూత లేదని దుయ్య బట్టారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి, తినడానికి అవసరమైనటువంటి నిత్యవసర వస్తువులను ప్రభుత్వము అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ప్రతి వారికి పది లక్షలు ప్రభుత్వం ఇచ్చి ఆడుకోవాలని డిమాండ్ చేసినారు. 

నీటితో మునిగిన ఇండ్లను క్లిన్ చేయడానికి మున్సిపాలిటీ అధికారులు సహాయం చేయాలనీ, అంటూ వ్యాధులు రాకుండా షానిటేషన్ చేయించాలని డిమాండ్ చేసారు  ఈ బృందం లో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరాం, మాస్ లైన్ సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, పి ప్రకాష్, బి బాబన్న, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్ష,  కార్యదర్శులు ఎం నరేందర్, జి సురేష్, పార్టీ నాయకులు ఎం అనిస్, ఎస్.కిషోర్, బి కిషోర్, ఎం సాయరెడ్డి, పి డి ఎస్ యు నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad