నవతెలంగాణ – దామరచర్ల
ప్రభుత్వం నిర్దేశించిన పౌష్టిక ఆహారం రుచికరంగా విద్యార్థులకు సరిపడా అందించాలని మండల ప్రత్యేక అధికారి జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ పేర్కొన్నారు. దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్ ను శనివారం తనిఖీ చేశారు. అనంతరం బాలికలతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం రుచి చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు నాణ్యతగా ఉన్నాయని, ఇదే విధముగా ప్రతిరోజు అందిస్తున్నారా అని విద్యార్థుల నుండి సమాచారం రాబట్టారు. బాలికలు మెనూ చాట్ లో ఉండే ఆహార పదార్థాలే ప్రతిరోజు అందిస్తున్నారని అధికారుల పర్యవేక్షణ వలన నాణ్యత ప్రమాణాలు పెరిగాయని తెలిపారు. స్టాక్ రూం, స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించి వ్యత్యాసం లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం బెట్టితండా అంగన్వాడీ కేంద్రం ను పరిశీలించారు. వారి వెంట మండల విద్యాధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
ఆదర్శ (బాలికల) హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES