నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
చిన్నారి వైద్యానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థికంగా చేయూతను అందించారు. సిరిసిల్లలోని శివ నగర్ కు చెందిన వేముల మధు దంపతులకు కవలలు (కొడుకు, కూతురు) జన్మించారు. అనారోగ్య సమస్యతో కూతురు ఆస్పత్రిలో మరణించారు. కొడుకు హైదరాబాద్ లోని దవాఖాన లో చికిత్స పొందుతున్నాడు. తమ కొడుకు వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని వేముల మధు కలెక్టర్ కు విన్నవించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.చిన్నారి వైద్యానికి రూ. 50 వేల చెక్కును జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అందజేశారు. చిన్నారి చికిత్సకు భరోసా ఇచ్చారు.
క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం..
సిరిసిల్ల పట్టణానికి చెందిన బోనాల వెంకటేష్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తన వైద్యానికి ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వెంకటేష్ విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ …బోనాల వెంకటేష్ వైద్యానికి రూ. 1,25,000 ఆర్థిక సహాయం అందజేశారు. తమ బాధను అర్థం చేసుకొని ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు
చిన్నారి, క్యాన్సర్ రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.