మాజీ ఎంఎల్ ఏ నోముల భగత్
నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ నాయకులు సమాయత్తం కావాలని పిలుపు నిచ్చారు. శనివారంనాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు త్రిపురారం మండలం లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా పనిచేసుకోవాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, ఏ అంశాలు ప్రజల్లో చర్చ పెట్టాలి అనే విషయాలు చర్చించి, నాయకులను, కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసే కార్యచరణ చేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, మండల ఆడాక్ కమిటీ అధ్యక్షులు పామోజు వెంకటాచారి, మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, బిఆర్ఎస్ నాయకులు మడుపు వెంకటేశర్లు, కలకొండ వెంకటేశ్వర్లు, జంగిలి శ్రీనివాస్, భైరం కృష్ణ, అనుముల శ్యామసుందర్ రెడ్డి, వనజ,సుశీల్ నాయక్, యాదయ్య, సయ్యద్, శేఖర్, దస్తగిరి మరియు త్రిపురారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES