హైదరాబాద్ : జీఈ వెర్నోవాకు చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్‌తో అదనపు దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ప్రెసిషన్ ఇంజనీరింగ్‌లో గ్లోబల్ లీడర్ అయిన ఆజాద్ ఇంజనీరింగ్ ప్రకటించింది. 53.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.450 కోట్లు) విలువైన ఈ ఒప్పందం 2030 వరకు ఆరేండ్ల పాటు కొనసాగనుందని తెలిపింది. హైదరాబాద్‌లోని తునికిబొల్లారంలో ఆజాద్ ఇంజనీరింగ్ వారి ప్రత్యేకమైన 7,600 చదరపు మీటర్ల లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇటీవల ప్రారంభించిన తర్వాత ఈ అదనపు ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ఆ సంస్థ చైర్మన్, సిఇఒ రాకేష్ చోప్దార్ తెలిపారు. తాజా ఒప్పందం జీఈ వెర్నోవా అధునాతన టర్బైన్ వ్యవస్థలు, అవసరమైన పరిశ్రమల కోసం అత్యధిక పనితీరు కనబరిచే వ్యవస్థల విశ్వసనీయ సరఫరాదారుగా ఆజాద్ ఇంజనీరింగ్ నిలుస్తుందన్నారు.
జీఈ వెర్నోవాతోఅజాద్ ఇంజనీరింగ్ మరో ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES