నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు మత్తడి దూకుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూలంగా ఎక్కువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వర్షపునీరు ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరడంతో శుక్రవారం అర్ధరాత్రి నుండి గట్టు పొడిచిన వాగు మత్తడి పారడం ప్రారంభమైంది. చుట్టుగుట్టలు, దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఈ గట్టు పొడిచిన వాగు మత్తడి దూకి అలుగు పారుతుండడంతో పెద్ద ఎత్తున వరద నీరంతా కోనాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టులకు చేరుతుంది. ఈయేడు కూడా గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుండడంతో ప్రాజెక్టు కాలువల ద్వారా అమీర్ నగర్, కోన సముందర్ చెరువులను నింపుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా చెరువుల పరిధి ఆయకట్టులో పంటలు పండించుకోవడానికి నీటి ఇబ్బందులు తప్పిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మత్తడి దూకుతున్న గట్టు పొడిచిన వాగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES