Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురేపు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు : పొంగులేటి

రేపు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు : పొంగులేటి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్‌పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే పంట నష్టంపై ఉన్నతాధికారులతో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్‌కు పంపినట్లు చెప్పారు. 2022–23 రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ టెండర్లలో తప్పులు జరిగాయని, మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం రికవరీ చేయాలని, అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad