Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅసెంబ్లీకి రాకపోతే కేసీఆర్‌ తప్పు ఒప్పుకున్నట్టే: మంత్రి కోమటిరెడ్డి

అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్‌ తప్పు ఒప్పుకున్నట్టే: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రేపటి నుంచి శాసనసభలో చర్చ జరగనుందని, ఈ చర్చకు కేసీఆర్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సభకు రాకపోతే కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పును స్వయంగా అంగీకరించినట్లే అవుతుందని అన్నారు.

కాళేశ్వరం అంశంలో తప్పు జరిగింది కాబట్టే కేసీఆర్ భయపడుతున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. “అసెంబ్లీకి రావాల్సిందే.. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని, ప్రభుత్వ ఆరోపణలకు జవాబివ్వాలని సవాల్ విసిరారు. మరోవైపు, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, గోపీనాథ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా, శాసనమండలిలో మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad