- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ, జన్నారం మండలాల కో-ఆర్డినేటర్లను నియమిస్తూ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. జన్నారం మండలం లోతరే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మండాడి నాణేశ్వర్ ఖానాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్గా నియమితులయ్యారు. అలాగే కవ్వాల్ గ్రామానికి చెందిన షాకీర్ అలీని జన్నారం మండలం కో-ఆర్డినేటర్ గా నియమించారు. అలాగే జన్నారానికి చెందిన రాహుల్ యాదవును మరో మండల కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
- Advertisement -