- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పట్టణంలోని పలు వార్డులలో పారిశుధ్య నిర్వహణ పనులపై మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీసీ కాలనీ, మమత నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయించారు. ప్రైవేట్ ప్లాట్ లలోని నీటి నిల్వలను అందుబాటులో ఉన్న డ్రైనేజీలలోకి మళ్లీంచడం జరిగింది. అనంతరం సానిటేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా ఎప్పటికప్పుడు ప్రజల ద్వారా అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు.
- Advertisement -