సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా విడుదల
నవతెలంగాణ – పెద్దవంగర
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీడీవో అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు చేసిన సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్డుల మార్పు, గ్రామాల్లో లేనివారు, వివాహం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, రెండు ఓట్లు ఉన్న వారు, చనిపోయిన వారి వివరాల సవరణకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలన్నారు.
అఖిలపక్ష నాయకులు చేసిన అభ్యంతరాలను నేడు అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుని సవరించిన తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు కట్టోజు భాస్కరా చారి, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్, సనీల్ రెడ్డి, పూర్ణచందర్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడు హరికృష్ణ, వేణు, సమ్మయ్య, రఘు, వెంకట్రామయ్య, చిలుక దేవేంద్ర, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES