నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి మండలం అప్పయ్య పల్లి గ్రామంలో డిప్యూటీ తాసిల్దార్ చక్రపాణి ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా అప్పయిపల్లి గ్రామంలో చేపట్టిన వేడుకల్లో వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. పౌర హక్కుల దినోత్సవం ప్రతినెలా చివరి రోజున జరుపుకోవడం జరుగుతుందని ఎస్సీ ఎస్టీల మీద జరిగే అన్యాయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఇంకా ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకువస్తే చట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు అందరూ స్వేచ్ఛ సమానత్వం సోదరా భావం కలిగి ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ అందరూ కులమత బేధం లేకుండా సోదర భావంతో కలిసి ఉండాలని సూచించారు.
అబ్బాయి పల్లెలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES