నవతెలంగాణ – బొమ్మలరామారం
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎల్ హెచ్ పీఎస్ మండల అధ్యక్షులు ఇస్లావత్ కృష్ణ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని చీకటిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లంబాడాలు ఆదివాసులు అన్నదమ్ములుగా ఉండే మా మధ్య చిచ్చు పెట్టాలని తెల్లం వెంకట్రావు చూస్తున్నారని, ఈరోజు మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారంటే అది మేము వేసిన ఓట్లే అని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. ఆయన మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ యువజన శాఖ అధ్యక్షులు పరమేష్ నాయక్, ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్, ధీరావత్ రమేష్ నాయక్, మాలోత్ వినోద్ నాయక్, ఇస్లావత్ చత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES