Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వాయిదా పడిన పరీక్షల షెడ్యూలు విడుదల..

వాయిదా పడిన పరీక్షల షెడ్యూలు విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా తెలంగాణ యూనివర్సిటీ  పరిధిలో 28 -8-2025 , 29-8-2025 మరియు 30-8-2025 న జరగాల్సిన పీజీ పరీక్షలు 2-9-2025 మరియు3-9-2025 న బీఎడ్/ బిపి ఎడ్ పరీక్షలు  6-9-2025,8-9-2025 మరియు 9-9-2026  జరుగుతాయని ఎమ్మేడ్ పరీక్షలు  2 -9-2025 ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి  ప్రొఫెసర్ కే సంపత్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను  సంప్రదించాలని కంట్రోలర్ పేర్కొన్నారు.

ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎమ్ పరీక్షల తేదీ ప్రకటన..

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎల్.ఎల్.బి. మరియు ఎల్.ఎల్.ఎం. – నాలుగవ  సెమిస్టర్ రెగ్యులర్ / థియరీ పరీక్షలు 08-09-2025 నుండి 17-09-2025 వరకు నిర్వహించబడతాయని. పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందపరచడం జరిగింని తెలిపారు.

తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో  స్పాట్ అడ్మిషన్స్ పొడగింపు..

తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు  అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఇఎపీసిఇటి -2025 ఉత్తర్వుల ప్రకారం  భారీ వర్షాల కారణంగా తెలంగాణ  యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో  సెప్టెంబరు ఒకటి మరియు రెండవ తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ కొనసాగించాలని నిర్ణయించారు.ఇప్పటివరకు స్పాట్లో  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో  6 గురు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)లో 4 గురు అడ్మిషన్ పొందినట్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ అరతి పేర్కొన్నారు.తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో  నేటికీ నమోదైన మొత్తం అడ్మిషన్లు  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 57 కంప్యూటర్ సైన్స్ ( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ )లో 12 మంది విద్యార్థులు  అడ్మిషన్స్ పొందినారని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్  ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad