- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గుట్ట కింద తండాలో గత రెండు మూడు రోజులపాటు కురిసిన వర్షానికి తాండ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో శనివారం తాండకు చెందిన యూత్ సభ్యులు తాండ పెద్దల ఆధ్వర్యంలో ఈ రోడ్డుకు మరమ్మతులు చేయడానికి మట్టి వేసి చదును చేసి, ఇబ్బందులు కలగకుండా చూసినట్లు లంబాడ పోరాట హక్కుల సమితి అధ్యక్షులు మహిపాల్ నాయక్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శాశ్వత పరిష్కారం లభించే విధంగా అందరితో కలిసి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -