నవతెలంగాణ – డిచ్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం డిచ్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను, అన్ని గ్రామ పంచాయతీల పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన జాబితాను వారికి చూపించి, దానిపైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీ కార్యదర్శులకు సూచించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తక్షణమే సరిచేసి సమర్పించాలని ఆదేశించారు.
పార్టీ నాయకులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. గ్రామంలో వార్డ్ ల వారిగా విభజించి చేసిన ఓటర్ల జాబితాలో ఎక్కడా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను వేరే వార్డ్ లో రాకుండా ఒకటే దానిలో వచ్చేటట్టుగా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జాబితా సరిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారిని గుర్తించాలని, వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన వారు ,వివాహమై వెళ్లిపోయిన వారిని గుర్తించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ డి.యల్.పి.ఓ. శ్రీనివాస్, యం.పి.డి.ఓ. రాజ్ వీర్ , యం.ఆర్.ఓ. సతీష్ రెడ్డి, యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, అన్ని రాజకీయ పార్టీల నాయకులూ పాల్గొన్నారు.
అభ్యంతరాలు ఉంటే సమర్పించండి: ఆర్డిఓ రాజేంద్ర కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES