– మునిసిపాలిటీ కమీషనర్ బి.నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉత్సవం విగ్రహం నిమజ్జనం సమయంలోనూ ఉత్సవ కమిటీల లో పాటు భక్తులు నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని మున్సిపాల్టీ కమీషనర్ బి.నాగరాజు సూచించారు. పట్టణ సమీపంలోని వెంకమ్మ (పెద్ద) చెరువు లో నిమజ్జనం స్థలాన్ని సీఐ పి.నాగరాజు రెడ్డి,ఎస్.హెచ్.ఓ యయాతి రాజు తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుండి విగ్రహ నిమజ్జనం ప్రారంభం కానున్న దృష్ట్యా అవుతాయని 5, 6, 9, 11 వ రోజుల్లో జరిగే నిమజ్జనానికి వెంకమ్మ చెరువు అలుగు వద్ద నిమజ్జన సమయంలో కావాల్సిన ఏర్పాట్లను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. నిమజ్జనానికి విగ్రహాలను తరలించే వాహన డ్రైవర్ లు అప్రమత్తంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ ఎస్ఐ సైదులు పాల్గొన్నారు.
నిమజ్జనంలోనూ నిబంధనలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES