No menu items!
Monday, September 1, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి..

పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి..

- Advertisement -

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి హెచ్.ఎస్.జే అనిల్ కుమార్ జూకంటి
నవతెలంగాణ – వనపర్తి

చిన్నపిల్లల రక్షణ భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి హెచ్.ఎస్.జే అనిల్ కుమార్ జూకంటి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి హెచ్.ఎస్.జే అనిల్ కుమార్ జూకంటికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సాదరంగా ఆహ్వానం పలికారు. కలెక్టర్ తో న్యాయమూర్తి మాట్లాడుతూ చిన్నపిల్లల రక్షణ భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన పోక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి తో కలిసి నాగవరం శివారులో సర్వే నెంబర్ 200 లో నూతన కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ప్రతిపాదిత ఆత్మకూరు – పెబ్బేరు బైపాస్ రోడ్డును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి బైపాస్ రోడ్డు అలైన్ మెంట్ ను కొంత మార్చాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను సూచించారు. వనపర్తి జిల్లా జడ్జి యం.ఆర్. సునీత, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్, సీనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, రజనీ, అశ్విని, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, రోడ్లు భవనాల ఇంజనీరు దేశ్యా నాయక్ తదితరులు హైకోర్టు న్యాయమూర్తి వెంట ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad