Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుయూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

- Advertisement -

– సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణా రెడ్డి..
నవతెలంగాణ – తొగుట

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాన్ గల్ సొసైటీ చైర్మన్ కె. హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య పేర్కొన్నారు. తొగుటలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేయడంతో వారికి కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ.. యూరియా కోసం ఎన్నిసార్లు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసినా సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు నిద్ర హారాలు మాని తొగుట చుట్టూ తిరు గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు రావాలంటూ అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత తో పూర్వ పాలనను గుర్తుకు తెస్తున్నారని అన్నారు. 

యూరియా కోసం పండుగ, పబ్బం లేకుండా రాత్రి పగలు, చేను చేలుక, ఆపద సంపద, వానా ఎండా లేకుండా రైతులు తిరుగుతున్నారని, కాంగ్రెస్ ను గద్దె నెక్కించినందుకా ఈ కష్టాలు అని ప్రశ్నించారు. యూరియా కొరత లేదనే కాంగ్రెస్, బీజేపీ నాయ  కులు ఒక్కసారి ప్రజల వద్దకు వొచ్చి మాట్లా డాల న్నారు. సిద్దిపేట జిల్లాలో ఇతర మండలాలకు ఎక్కువ యూరియా సరఫరా చేస్తూ తొగుట మండలం మీద వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చెప్పారు. సకాలంలో రెండు మూడు రోజుల్లో యూరియా అందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బం గా రైతుల రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. యూరియా కావాలి, కలెక్టర్ రావాలి, కెసిఆర్ రావాలి, రేవంత్ పోవాలి అంటూ నినాదాలు చేశారు. తొగుట సీఐ లతీఫ్, తహసీ ల్దార్ శ్రీకాంత్, ఏవో మోహన్ లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు రెండు రోజుల్లో 4 లారీల యూరియా పంపిస్తామని హామీ ఇవ్వడంతో పాటు రైతులకు ముందస్తుగా టోకెన్లు ఇస్తామని తెలుపడంతో రైతులు ఆందోళన విరమించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad