Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంప్రజా సమస్యలపై చర్చలకు సూచించాలి

ప్రజా సమస్యలపై చర్చలకు సూచించాలి

- Advertisement -

బురద రాజకీయాలే మీకు ముఖ్యమా? : మాజీ మంత్రి టి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో సూచించాలని మాజీ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదారాబాద్‌లోని శాసన సభ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. మొదటి ప్రాధాన్యత వరదలపై, రెండో ప్రాధాన్యత యూరియాపై చర్చించాలని కోరామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని చెప్పారు. విద్యార్థుల మరణంపై చర్చ జరగాలన్నారు. ఫోర్త్‌సిటీ పేరున జరుగుతున్న అక్రమాలు, సీఎం కుటుంబ సభ్యులపై చర్చ కోరామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, బెనిఫిట్లు, హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. వీటిపై స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీ నుంచి వాకౌట్‌ చేశామని తెలిపారు. వరద బాధితుల గురించి కాకుండా బురద జల్లే రాజకీయాలు అసెంబ్లీలో మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అదే మీకు ముఖ్యమా? అని సీఎంను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించకపోవడమే ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ రైతుల ఉసురు పోసుకుంటున్నాయని విమర్శించారు.
సహకరించండి..ఆది శ్రీనివాస్‌
ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేస్తూ కేసీఆర్‌ చట్టం చేశారని గుర్తు చేశారు. బీసీలకు న్యాయం చేసే విధంగా చర్య, చర్చ జరగబోతుందన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై చర్చకు సహకరించాలని కోరారు. కేంద్రం నిధుల విషయంలో వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు. యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని, ఆ నిందను తమ ప్రభుత్వంపై వేయటం తగదని హితవు పలికారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ యూరియా కొరతకు కారణం బీజేపీ నేతలేనని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే సపోర్ట్‌ చేస్తామని బీఆర్‌ఎస్‌ చెప్పడాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి నయాపైసా కూడా కేంద్రం నుంచి తేలేని కిషన్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టించేందుకే యూరియా సమస్యను బీఆర్‌ఎస్‌ నేతలు ముందుకు తెస్తున్నారని విమర్శించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికతో బీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు మొదలైందని తెలిపారు. అందుకే మరో మారు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ, అందుకే చర్చను తప్పుదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. వరదలకు వేల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad