Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పుష్కర ఘాటు వద్ద కింద పడిపోయిన ట్రాన్స్ఫార్మర్... 

పుష్కర ఘాటు వద్ద కింద పడిపోయిన ట్రాన్స్ఫార్మర్… 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. గత 48 గంటలుగా ఘాట్ వరద నీటితో మునిగిపోవడం తో నేడు నీటి ప్రవాహం తగ్గి పోవడంతో స్థానికులు అక్కడికి వెళ్ళగా ట్రాన్స్ఫార్మర్ కింద పడి కనిపించింది. ప్రవాహ వేగానికి స్తంభం కింద పడి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి స్తంభం ఏర్పాటుతోపాటు ట్రాన్స్ఫార్మర్ను బిగించి కరెంట్ సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad