Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeసినిమాట్రెండీ కథతో 'కానిస్టేబుల్‌'

ట్రెండీ కథతో ‘కానిస్టేబుల్‌’

- Advertisement -

జాగృతి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై వరుణ్‌ సందేశ్‌, మధులిక వారణాసి జంటగా రూపొందుతున్న థ్రిల్లర్‌ చిత్రం ‘కానిస్టేబుల్‌’.
ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వంలో బలగం జగదీష్‌ నిర్మిస్తున్నారు.
ఆదివారం మేకర్స్‌ నిర్వహించిన వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా కంటెంట్‌ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. వరుణ్‌ సందేశ్‌ కూడా తన పాత్రలో ఒదిగి పోయి ఉంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు. ‘సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం కలిగింది’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. నిర్మాత బలగం జగదీశ్‌ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు, దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశానికి.. సందేశాన్ని మిళితం చేసి తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘ఇందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగు పాటలు ఉన్నాయి. సందేశంతో పాటు కమర్షియల్‌ అంశాలున్న చిత్రమిది. బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునే సినిమా’ అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ చెప్పారు. ‘మా కానిస్టేబుల్స్‌ మీద ఒక సినిమా చేయడం, కానిస్టేబుల్‌ అనే టైటిల్‌ పెట్టడం అనేది మాకు చాలా సంతోషకరం’ అని సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad