Wednesday, May 7, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం..

ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం..

- Advertisement -

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ 
నవతెలంగాణ – చండూరు  
: బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం రైతాంగం పెద్ద ఎత్తున సిద్ధం కావాలని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ  పిలుపునిచ్చారు.  మంగళవారం   ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో  చండూరు ఎంపీడీవో బి. యాదగిరి , మున్సిపల్ కమిషనర్ పుష్పలతకుకు సమ్మె నోటీసులు అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులు కాలరాస్తుందని, వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టలు కొడుతుందని వారు విమర్శించారు. ధరలు నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. దేశంలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో పెరిగి పెద్దవైన ప్రభుత్వ రంగ సంస్థలని, గనులు భూములు ఓడరేవులు సహజ వనరులన్నిటిని స్వదేశీ విదేశీ బడా పెట్టుబడుదారులకు కారు చౌకగా అమ్ముతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు చేస్తూ సమస్యలను పక్కదోవ పట్టిస్తూ కాలం గడుపుతుందని ఎద్దేవ చేశారు. ఈ విధానాలను ప్రతిఘటించడం కోసమే కార్మిక వర్గం రైతాంగం 145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో రైతాంగం కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, బిపంగి నాగరాజు, వాటర్ మెన్ లు రామచంద్రం,రాము, రేణుక, ముత్తమ్మ, ఎలక్ట్రీషియన్ లు నరసింహ,బిల్ కలెక్టర్లు, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ అధికారులు అరుణ, అనురాధ, భరత్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -