Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యూరియా కోసం రైతుల ఆందోళన 

యూరియా కోసం రైతుల ఆందోళన 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు : మండలంలోని కొండనాగుల వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ముందు సోమవారం యూరియా కావాలంటూ రైతులు ఆందోళనకు దిగినారు. వరి పంటకు మక్కా పంటకు కూడా యూరియా అవసరమని సకాలంలో యూరియా వాడకపోతే పంట దిగుబడి దెబ్బతింటుందని తగినంత యూరియా వెంటనే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగిల్ విండో సీఈవో రాజ వర్ధన్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ యూరియా సరిపడా ఉన్నదని స్టాకు ఈరోజుకు అయిపోయిందని రేపు మళ్లీ స్టాక్ వస్తుందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానో యూరియాను వాడమని చెబుతున్నారని మీరు కూడా అలాంటి ఎరువులను వాడినట్లయితే బాగుంటుందని సూచించారు. నాను ఎరువుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భూమి సారవంతంగా మారుతుందని అన్నారు. నానో ఎరువు వాడమంటున్నారు మీ కార్యాలయానికి ఏమైనా కంపెనీ వారు కమిషన్లు ఇస్తున్నారా అనే రైతులు ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని కావలిస్తే మీరు తెలుసుకోవచ్చని సీఈవో వివరణ ఇచ్చారు. ఏదేమైతే నేమి రైతులకు సకాలంలో ఎరువులను యూరియాను ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad