Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్2వ తేదీ నుండి జిల్లాలో  భారీ వర్షాలు: బాన్సువాడ సబ్ కలెక్టర్

2వ తేదీ నుండి జిల్లాలో  భారీ వర్షాలు: బాన్సువాడ సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ :  కురిసే అవకాశం ఉన్నదని కావున డివిజన్ లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డా: కిరణ్మయి కొప్పిశెట్టి, ఐ.ఎ.ఎస్.  అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బాన్సువాడ డివిజన్ లో  అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. కుంభవృష్టి వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు.

ముంపునకు గురయ్యే ప్రాంతాలు,  అధికంగా ఓవర్ ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిచిపోయిన పాత ఇండ్లు, భవనాలలో నివాసం ఉండవద్దని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలోని మండలాలలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని,అదేవిధంగా  గ్రామాలు,మండలాలు మరియు మున్సిపాలిటీల వారిగా  ఎప్పటికప్పుడు పరిస్థితులను డివిజన్ / జిల్లా స్థాయిలో తెలియజేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్  అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. చేపల వేటకు వెళ్ళేవారు, పశువుల మరియు గొర్రెల కాపరులు నీటి పరివాహక ప్రాంతలలో అధికారుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిండమైనది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad