నవతెలంగాణ – డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి సమత పర్యవేక్షణలో పరిశోదక విద్యార్థి ఎల్.టీ. హేమలత ‘సైకలాజికల్ యాస్పెక్ట్స్ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్ ‘ అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై సోమవారం ఓపెన్ వైవా జరిగింది. ఈ ఓపెన్ వైవా కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ మేఘన రావు ఆన్లైన్లో పరిశీలించింది.అనిత నాయర్ కు సంబంధించిన నవలను పూర్తిగా సమీక్షించి పరిశోధక విద్యార్థిని ఎంచుకున్న లక్ష్యాలను పరిశోధక విద్యార్థి నుండి రాబట్టారు. అనంతరం ఎ ల్టి హేమలతకు పిహెచ్డి అవార్డు ప్రధానం చేయాల్సిందిగా యూనివర్సిటీ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ వైవా కు డీన్ ప్రొఫెసర్ లావణ్య హెడ్ డాక్టర్ కె.వి.రమణ చారి, ఫ్యాకల్టీ డాక్టర్ స్వామి రావు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్టి హేమలతకు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంగ్ల విభాగంలో ఎల్ టీ హేమలతకు డాక్టరేట్ ప్రధానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES