Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గుత్తికోయ గూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్

గుత్తికోయ గూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్

- Advertisement -

గుత్తి కోయలకు వాటర్ బాటిల్ పంపిణీ..
తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి
: మండలంలోని కొండపర్తి గుత్తి కోయ గూడెంలో మంగళవారం స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగడానికి ముందే దాని నిరోధించడం దాని ముఖ్య ఉద్దేశం ఉన్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మెట్ వాడకం మద్యం సేవించకుండా సీట్ బెల్ట్ ధరించి వేగం లాంటి అనేక భద్రత పాటిస్తూ వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలు జరగవని ఆయన సూచించారు. అలాగే బాల్యం వివాహాలు పిల్లలు భవిష్యత్తును నాశనం చేస్తాయని, గుత్తి కోయ గిరిజనులు చిన్న వయసులోనే పెళ్లిళ చేస్తున్నారని, అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాకినే వివాహాలు చేయాలని అన్నారు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఆవశ్యకతను సైబర్ నేరాలు పట్ల ప్రభుత్వము అవసరం గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో సివిల్స్, సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad