Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఆశాల ఛ‌లో హైదరాబాద్‌ విజయవంతం

ఆశాల ఛ‌లో హైదరాబాద్‌ విజయవంతం

- Advertisement -

– సమస్యల పరిష్కారానికి యూనియన్‌ ప్రతినిధులకు కమిషనర్‌ హామీ
– ఫిక్స్‌డ్‌ వేతనం, ఇన్సూరెన్స్‌పై ప్రభుత్వానికి నివేదిక
– క్షేత్రస్థాయిలో సమస్యలపై గైడ్‌లైన్స్‌


నవతెలంగాణ -సుల్తాన్‌బజార్‌
ఆశాల ఛ‌లో హైదరాబాద్‌ విజయవంతమైంది. తెలంగాణ ఆశా వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమీషనర్‌ ఆఫీస్‌ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున ఆశాలు పోలీసుల ఆంక్షలను, ఆటంకాలను అధిగమించి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులతో కమిషనర్‌ చర్చించి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు ఆశావర్కర్లతో కలిసి యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి కోఠి ఆంధ్ర బ్యాంక్‌ చౌరస్తా నుంచి ర్యాలీగా డీఎంహెచ్‌ఎస్‌ వరకు వచ్చారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీ చౌరస్తా ప్రధాన రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల పారితోషికాలు తగ్గించాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్‌ రూ.50 లక్షలు, ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

కమిషనర్‌తో చర్చలు
ఆశావర్కర్ల ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకొని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సంగీత సత్యనారాయణతో మాట్లాడి చర్చలకు పిలిచారు. యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం 20 మందిని, రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మిని చర్చలకు ఆహ్వానించారు. ఆశాలకు ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18 వేలు ఇవ్వాలనే విషయాన్ని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, రూ.50 వేలు అంత్యక్రియల ఖర్చులు, ప్రమోషన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కమిషనర్‌ హామీనిచ్చారు. ప్రతినెలా పారితోష ికాలు తగ్గించకుండా మొత్తం అమౌంట్‌ను 1వ తేదీ లోపు అకౌంట్‌లో వేస్తామని కమిషనర్‌ చెప్పారు. పెండింగ్‌లో ఏమేమున్నాయో బడ్జెట్‌ చూసుకొని ఎన్‌హెచ్‌ఎం ద్వారా అవి వెంటనే విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నోట్‌ ఇస్తే చర్చించి గైడ్‌లైన్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలను చెల్లిస్తామని తెలిపారు. ఈ చర్చలకు యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాసు మాధని, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి గంగమణితోపాటు జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, సీఐటీయూ జిల్లాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేష్‌, హైదరాబాద్‌ సౌత్‌ అధ్యక్షులు ఎం.శ్రావణ్‌ కుమార్‌, నాగేశ్వర్‌, సాయి బాబు, నిక్సన్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు చలో హైదరాబాద్‌ కార్య క్రమానికి రాకుండా సోమవారం ఉదయమే ఆశాలు, సీఐటీయూ నాయకులను జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు. అనంతరం విడిచిపెట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad