– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
– కలెక్టరేట్ ఎదుట పిప్పల్‌కోటి రిజర్వాయర్ రైతుల ధర్నా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ భూనిర్వాసిత రైతులకు నష్టపరిహారం రెట్టింపు చేసి, వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసిత రైతులతో కలిసి సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లా డుతూ.. ఏడేండ్ల కిందట ఇవ్వాల్సిన నష్ట పరి హారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం అన్యాయ మన్నారు. ఆ రోజు నిర్ణయించిన ధర ఎకరాకు ఎనిమిది లక్షలు అన్నారని, ప్రస్తుతం భూమి విలువ రెట్టింపు అయినందున నష్టపరిహారం రెట్టింపు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లోనే రైతుల నష్టపరిహారానికి సంబంధిం చిన బడ్జెట్ విడుదల చేయాలన్నారు. బోథ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, పాయల శంకర్ అసెంబ్లీలో రైతుల నష్టపరిహారం గురించి ప్రస్తావిం చాలని, తద్వారా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు నసిరుద్దీన్ మాట్లాడుతూ.. భూములు దున్నుకోలేక అమ్ముకోలేక అవస్థలు పడుతున్నామన్నారు. పిల్లల పెండ్లిళ్లు చేయాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అనేక మంది రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసి వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్ భూములను సందర్శిం చాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, గ్రామ కార్యదర్శి ధొనిపెల్లి స్వామి, నాయకులు లింగాల చిన్నన్న, గంగాసాగర్, గ్రామ రైతులు ఎస్‌కే. నసిరుద్దీన్, ఆయిటి అశోక్, పెంటన్న, మామిడి నారాయణ, మొట్ట గంగయ్య పాల్గొన్నారు.