– పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ధర్నాలు
– ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నిరసన ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు ధర్నాలు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహిం చారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పలు మండలాల్లో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జిల్లా జేఏసీ చైర్మెన్ వడ్డబోయిన శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎండీ రఫీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లిలో కలెక్టర్ కార్యాలయం వరకు ఉద్యోగ,ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లాలో అంబేద్కర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగస్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మెన్ ఆకుల రాజేందర్, జేఏసీ వరంగల్ జిల్లా చైర్మెన్ గజ్జెల రాంకిషన్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, గెజిటెడ్ అధికారుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సీపీఎస్, యూపీఎస్ వద్దు.. ఓపీఎస్ మాత్రమే కావాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ సహా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ”సీపీఎస్ మాకొద్దు-యూపీఎస్ మాకొద్దు -పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) మాత్రమే కావాలి” అని నినదించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
సీపీఎస్ వద్దు.. ఓపీఎస్ కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES