Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపొలాలను వదలని వరద

పొలాలను వదలని వరద

- Advertisement -

– పాలమూరులో పత్తి రైతు కుదేలు
– రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
– చౌడు నల్ల భూముల్లో అధిక ప్రభావం


నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
వర్షం తగ్గినా పంట చేలలో నీరు తగ్గలేదు. చెరువులు నదుల పరివాహక ప్రాంతాల్లో వేసిన పత్తి చేలు ఇంకా వరదలోనే ఉన్నాయి. జూన్‌ మొదటి వారంలో వేసిన పంటలు పూత కాత దశలో ఉన్న సమయంలో ఇటీవల ఆగస్టు నెలలో కురిసిన వర్షాలు పత్తి పంటకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఇసుక మేటలతో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ వంటి పంటల నష్టం వాటిల్లింది. ఇందులో పత్తికి తీవ్రంగానే వానదెబ్బ కొట్టిందని అధికారు లు, రైతు సంఘాల నాయకులు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో విత్తన పత్తి సాగులో విత్తులకు సరిపడా కూడా దిగుబడి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చౌడు నల్ల భూముల్లో సాగు చేసిన పత్తి పైర్లు నేల చూపు చూస్తు న్నాయి. పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. నెల రోజులుగా కురిసిన వర్షాలకు పత్తి, కంది, వేరుశనగ పొలాల్లో వరద చేరింది. నాగర్‌కర్నూల్‌, గద్వాల, మహబూబ్‌నగర్‌ పరిధిలో పత్తి పంట అత్యధికంగా సాగవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు. గద్వాల జిల్లాలోని సీడ్‌ పత్తితోపాటు దూది పత్తి లక్షన్నర ఎకరాలు సాగు అవుతోంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు, మహబూబ్‌ నగర్లో లక్ష ఎకరాలు, నారాయణపేట జిల్లాలో లక్ష ఎకరాలు, వనపర్తి జిల్లాలో 1,25,000 ఎకరాలు సాగు చేశారు.
వరదలో మునిగిన పత్తి
పూత పూసి.. కాత వచ్చే దశలో అధిక వర్షాలకు పత్తి చేను అంతా ఎర్రబారింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని తెలకపలి,్ల బిజినపలి,్ల తాడూరు, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. గద్వాల, అలంపూర్‌, ధరూర్‌, మల్దకల్‌, ఇటిక్యాల మండలాల పరిధిలో ఉన్న నల్ల మట్టిలో సాగుచేసిన పత్తి అంతా అధిక నీటితో ఎర్రబారిపోయింది.
పెరిగిన పెట్టుబడులు
ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు పెరిగాయి. విత్తనం ఒక్కో ఫ్యాకెట్‌కు 100 రూపాయలకు పైగానే అధిక ధర పెట్టి రైతులు తీసుకున్నారు. మొదట్లో వర్షాల్లేక విత్తనం మొలకెత్తలేదు. దాంతో రెండు మూడు సార్లు విత్తనం వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధిక వర్షాలు పైరును దెబ్బతీశాయి. యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు అధికంగా వినియోగించారు. ఎకరాకు రూ.35 వేలకు పైగానే ఖర్చు చేశారు. ఆ స్థాయిలో దిగుబడి వస్తుందా? లేదా? అని రైతుల్లో ఆందోళన నెలకొంది.

అప్పులు పెరిగాయి
బాలయ్య, రామగిరి, కల్వకుర్తి మండలం
రెండెకరాల భూమిలో పత్తి సాగు చేశాను. అధిక వర్షాలకు పూర్తిగా నీరు చిచ్చు పెట్టింది. పూత రాలి పోయింది. తిరిగి కాస్తుందన్న నమ్మకం పోయింది.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఆర్‌ శ్రీనివాసులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరదకు గురైన పంటలను పరిశీలించి నష్ట పరిహారం ఇవ్వాలి. రైతులు అప్పులపాలు కాకుండా ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad