- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ స్థానికులు ఏటా గణేశుడి విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. 1980లో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఆ ఏడాది భారీ వర్షం కారణంగా ఓ గణపతి విగ్రహాన్ని మసీదులోకి మార్చారు. అప్పటి నుంచి ఏటా మసీదులోనే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. హిందూ ముస్లింలు ఉమ్మడిగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒకసారి బక్రీద్, వినాయక చవితి ఒకేసారి రాగా.. ముస్లింలు నమాజ్ మాత్రమే చేసి, కుర్బానీకి దూరంగా ఉన్నారు.
- Advertisement -