Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి...

ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి…

- Advertisement -

నవతెలంగాణ – శాయంపేట : ఆశాలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని ఆశ వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని హైదరాబాదులో జరిగే సభకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని అన్నారు.

18 వేల రూ, ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇన్సెంటివ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. పారితోషి కం లేని పనులు చేయించవద్దని అన్నారు.తెమడకు సంబంధించిన బాక్సులు తీసుకురమ్మని చెప్పడం మానుకోవాలని అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వర్కర్లకు చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కవిత రజిత ప్రేమలత లత ఉన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad