20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్-సిఐటియు)
జిల్లా అధ్యక్షులు కటారి రాములు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కార్మికుల మెడకు ఉరితాడు లాంటి నాలుగో లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టి డబ్ల్యూ ఎఫ్-సిఐటియు)జిల్లా అధ్యక్షులు కటారి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ఆర్టీవో కార్యాలయంలో ఇన్చార్జి డిటిఓ రాహుల్ కుమార్ కు సమ్మె నోటిస్ అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ..కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, మొత్తం రవాణా రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు పూనుకుంటున్నది. కార్మికవర్గం రక్తం చిందించి 100 సంవత్సరాల క్రితం నుండి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసే, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మికుల హక్కులను హరించి, కార్మికుల్ని బానిసలుగా చేసేందుకు బిజెపి ప్రభుత్వం పూసుకుంటున్నది. అందుకే కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు వెనక్కి కొట్టి, మన సమస్యల పరిష్కారానికై, రవాణా రంగాన్ని రక్షించడానికి, ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మే 20న దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు మరియు రోడ్డు రవాణా కార్మిక సంఘాల అఖిల భారత సమన్వయ కమిటీ పిలుపునిచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలోని రోడ్డు రవాణా రంగంలో పనిచేసే ఆటో, క్యాబ్, డిసిఎం, లారీ, ట్రాలీ, మినీ డిసీఎం, టాటా ఎసి, ట్రాక్టర్, అంబులెన్స్, స్కూల్ బస్సు, ట్రక్కు, ప్రొక్లైనర్, వరికోత మిషన్, జెసిబి, బోర్ బండి, టూరిస్ట్ బస్సు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు, క్లీనర్స్, మెకానిక్స్, ఆపరేటర్లందరూ పెద్దఎత్తున మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ పబ్లిక్ & ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమ్మె ఎందుకు..? కార్మికులకు కొద్దిపాటి ఉపశమనాన్ని, భద్రతను కల్పించే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. వాటి అమలు కోసం ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. అవి అమలులోకి వస్తే యూనియన్ ఏర్పాటు చేసే హక్కు సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె చేసే హక్కు లాంటివన్నీ రద్దవుతాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. అయినప్పటికీ, మనకు కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్, నిర్దిష్ట పని గంటలు లేవు. పైగా పోలీసు అధికారుల వేధింపులు, ట్యాక్స్లు, జరిమానాలు అనేక రెట్లు పెరిగాయి. అన్ని నిత్యావసర వస్తువులు, విద్య, ఆరోగ్యంపై ఖర్చులు చాలా పెరిగాయి. కావున మే 20 న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES