- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని నాచారంలో విద్యుత్ స్తంభం విరిగి ఓ బైక్ పై పడింది. దీంతో బైక్ పై వెళుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున నాచారం పీఎస్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సాత్విక్ గా పోలీసులు గుర్తించారు. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ విరిగి మీద పడడంతోనే సాత్విక్ మరణించారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -