Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కేసీఆర్ పై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..

కేసీఆర్ పై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ప్రచారాలు సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని జుక్కల్ మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నీళ్ పటేల్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ర్యాలీ, నిరసన కార్యక్రమం మంగళవారం చేపట్టారు. జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బసవేశ్వర చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయినటువంటి కేసీఆర్ పై చేస్తున్నటువంటి అసత్య ప్రచారం, కాలేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లే మాటలను మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.

కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ కాలేశ్వరంపై వేసిన కమిషన్, తప్పుడు మాటలను వ్యతిరేకిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చౌక్ నుండి  బసవేశ్వర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, కిషన్ పవర్, రవి పటేల్, సుంకరి వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ భాను గౌడ్ , నాయకులు రాజశేఖర్ పటేల్, శివరాజ్ దేశాయ్, పావుడే బస్వంత్ , వాస్రే రమేష్ , దళిత నాయకుడు కిరణ్, ప్రభూ దేశాయ్ , రఘు, కోఆప్షన్ మెంబర్ నయీమ్ ఖాన్, మొగులాజీ , భూమన్న , లక్షెట్టి గంగాధర్, సుధాకర్ మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad