- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గ ఓటర్ లిస్టును ఎంపీడీఓ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తుగా ఓటర్ లిస్ట్ నమోదు కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఓటర్ లిస్ట్ సరి చయడం జరిగిన తర్వాత వాటిని ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని మండలాలకు సంబంధించిన ఓటర్ లిస్ట్ గోడలకు అతికించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు, ఎంపీ ఓ రాము , జూనియర్ అసిస్టెంట్ అనిల్ , సీనియర్ అసిస్టెంట్ మధు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -