– మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కూరగాయలు సాగు చేసే రైతులకి ఎంఐడిహెచ్ పథకం కింద ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కూరగాయ పంటల సాగుకు రాయితీ అందించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ తెలిపారు.అసక్తి ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టమాటా, మిరప, వంకాయ, బెండ, చిక్కుడు రకాలు, తీగజాతి తదితర కూరగాయలు సాగు చేసే రైతులు 40 శాతం రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎకరానికి రూ.9600 ఉద్యానవన శాఖ ద్వారా రాయితీ లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఉల్లి వేసే రైతులు కూడా 40 శాతం రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఎకరానికి రూ.8వేల రాయితీ పొందవచ్చని తెలిపారు.కూరగాయలు, ఉల్లి వేసే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాయితీపై పంటల సాగుకు దరఖాస్తు చేసుకునేందుకు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో మోర్తాడ్ డివిజన్ ఉద్యానవన శాఖ విస్తీర్ణ అధికారి సుధీర్ రాజ్, ఫోన్ నెంబర్ 9440728403 లో సంప్రదించాలని సూచించారు.
కూరగాయల సాగు రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES