నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ క్లబ్, లిటరరీ క్లబ్ లను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేకం ఉద్యమం చేసేందుకు ప్రహరీ క్లబ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లబ్ అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, ఉపాధ్యక్షులుగా ధర్మేంద్ర, కన్వీనర్ గా కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మలావత్ రాజు, సభ్యులుగా రిషి గౌడ్, మోక్ష, స్నేహ శ్రీ, విశ్వతేజ, లక్ష్మీ నరసయ్య, అభిరాం, శ్రీకాంత్, రిత్విక, శ్రీనాథ్, శృతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 15 వరకు లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో రీడ్ కార్యక్రమంలో భాగంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుస్తక పఠనం, కథలు చెప్పడం, రాయడం, రోల్ ప్లే ఏకపాత్రాభినయం, క్విజ్, లఘు నాటికలు, స్కిట్, స్వాతంత్ర సమరయోధులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తల గురించి ప్రతిరోజు ఒక పిరియడ్ లో ఉపాధ్యాయులు బోధిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్ పాఠశాలలో ప్రహరీ, లిటరరీ క్లబ్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES