నవతెలంగాణ – జుక్కల్
మున్నూరు కాపు వినాయక మండపాన్ని ప్రముఖ వెటర్నరీ వైద్యులు బండి వారి విజయ్ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బండి వారి విజయ్ మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడి ఉన్న కాపు సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆయన వినాయకుడికి మొక్కులు మొక్కి, ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మండపం వద్ద భారీగా మహా అన్న ప్రసాదం పండరి ఆధ్వర్యంలో వితరణ చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన వినాయకుని భక్తులు, సామాజిక కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు , ఉద్యోగులు, యువకులు హాజరై వినాయకుని దర్శించుకోవడం జరిగింది. గ్రామాలలో ప్రజలకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ సాయి సహకారాలు అందిస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వెటర్నరీ వైద్యుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద నిర్వాహకుడు పండరి, మాజీ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, జిపి కార్యదర్శి సతీష్, ఎఫ్ఏ సుభాష్, సుబ్రవార్ సాయిలు , రవి, శ్రీనివాస్ టీచర్, పావుడే బస్వంత్, వాగ్మారే లక్ష్మణ్ , కత్తే వార్ రాజు , రామప్పవార్ మాధవరావు , శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు వినాయక మండపాన్ని దర్శించుకున్న బండి వార్ విజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES