- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లీలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో ఏర్పాటు చేసిన షెత్కరి గణేష్ మండలి వద్ద మద్నూర్ ఎస్సై విజయ్ కొండ దంపతులు సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ దంపతులకు గణేష్ మండలి తరఫున నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఎస్సై దంపతులు ప్రత్యేక పూజలు అనంతరం గణేష్ మండలి వద్ద మహాదానంలో పాల్గొని భోజనాలు చేశారు. గణేష్ మండలి 50వ సంవత్సరం పూర్తైన సందర్భంగా గణేష్ మండలి వద్ద నిత్య మహా అన్నదానం కొనసాగుతుంది. శెత్కరి గణేష్ మండలి విగ్రహాన్ని చూసి ఎస్సై కుటుంబ సభ్యులు విగ్రహం చాలా పెద్దగా ఉందని, ఎడ్ల బండి పై విగ్రహం ఉన్నందున ఇంకా బాగుందని ఎస్సై తెలిపారు. అనంతరం నిర్వాహకులు ఎస్సై దంపతులను సన్మానించారు.
- Advertisement -